మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

ఓంకార జపం (Omkara Japam)


విశేషం: ఓంకారం (ప్రణవ నాదం) సకల మంత్రాలకు మూలం. ఈ విశ్వం ఉద్భవించిన తొలి నాదం “ఓం”. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్ష లేకుండా ఎవరైనా, ఏ సమయంలోనైనా జపించవచ్చు.

మంత్రం
ఓం

విశిష్టత & ప్రతి పదార్థం
“ఓం” (ప్రణవము) అనేది “అ”, “ఉ”, “మ” అనే మూడు అక్షరాల కలయిక.

అ: సృష్టి (బ్రహ్మ తేజస్సు)

ఉ: స్థితి (విష్ణు తత్వం)

మ: లయ (పరమశివ తత్వం)

అంటే సృష్టి, స్థితి, లయ కారులైన త్రిమూర్తుల సమైక్య స్వరూపమే ఈ ఓంకారం.

ఆరోగ్య ప్రయోజనాలు (Scientific & Spiritual Benefits)
సనాతన ధర్మంలో ఎంతో ప్రశస్త్యమైన “ఓం” నాదానికి గొప్ప వైజ్ఞానికపరమైన లాభాలున్నాయి:

ఏకాగ్రత (Focus): ప్రతిరోజూ ఓంకారాన్ని స్పష్టంగా జపించడం వల్ల మెదడు కణాలు ఉత్తేజితమై ఏకాగ్రత పెరుగుతుంది.

వాయుగత వికాసం: ఉచ్ఛారణ సమయంలో ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచించి శ్వాసకోశ సమస్యలు దరిచేరవు.

ఒత్తిడి నివారణ: నాద ప్రకంపనలు (Vibrations) నాడీ మండలాన్ని శాంతపరచి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

మొబైల్ ఫోన్ లేదా కౌంటర్ ముందు “ఓం” అని స్పష్టమైన స్వరంతో, లయబద్ధంగా పఠించి మీ దైనందిన జీవితంలో నూతన ఉత్తేజాన్ని పొందండి.


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..